: గర్భస్రావం వద్దు...కండోమ్ లు వాడండి: పోప్ సూచన
బ్రెజిల్ తో పాటు పలు దేశాలను జికా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా దేశాల్లో శిశువులు చిన్న మెదడులో లోపాలతో పుట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు అబార్షన్ లకు మొగ్గుచూపుతున్నారు. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. అబార్షన్ అంటే ప్రాణం పోసుకుంటున్న వ్యక్తిని హతమార్చడమేనని అభిప్రాయపడ్డ ఆయన, అబార్షన్లు మానవాళికి మంచిది కాదని అన్నారు. దీనికి బదులుగా గర్భనిరోధక పద్ధతులు పాటించడం మంచిదని, కండోమ్ వినియోగించవచ్చని ఆయన సూచించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు అబార్షన్ ఒక్కటే మార్గం అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.