: పక్కా సమాచారంతో వైమానికదాడులు... 40 మంది ఉగ్రవాదుల మృతి!


లిబియాలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో జరిపిన వైమానిక దాడులు ఫలితమిచ్చాయి. లిబియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...రాజధాని సమీపంలో సబ్రతా ప్రాంతంలో ఓ నివాసంలో ఉగ్రవాదులు సమావేశమయ్యారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న భద్రతాధికారులు వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆ నివాసం పూర్తిగా ధ్వంసం కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న 40 మంది హతమయ్యారు. అయితే ఈ తీవ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారు అనే విషయం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News