: చాందినీచౌక్ వీధుల్లో రిక్షాలో అమెరికా రాయబారి షికారు


ఇండియాలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఈ రోజు అందరికీ షాకిచ్చారు. కాసేపు ప్రోటోకాల్ పక్కన పెట్టి రాజధాని నగరంలో స్వేచ్చగా, హాయిగా విహరించారాయన. మామూలు రిక్షాలో పాత ఢిల్లీ గల్లీల్లో షికార్లు చేశారు. తన సహచరుడితో కలసి రిక్షాలో చాందినీచౌక్ వీధుల్లో చక్కర్లు కొట్టిన రిచర్డ్ వర్మ ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో పెట్టారు. 'పాత ఢిల్లీలోని చాందినీచౌక్ రహదారుల్లో మధ్యాహ్నం రైడ్' అంటూ దీనికి కామెంట్ కూడా జత చేశారు. దీనికి అభిమానుల నుంచి ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News