: మావోలు ఆయుధాలు వీడితే ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధం: రాజ్ నాథ్
రాజ్యాంగం పరిధిలో మావోయిస్టులతో చర్చలకు సిద్ధమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మావోలు హింస, ఆయుధాలను విడనాడితే ప్రభుత్వం చర్చలు జరుపుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం తగ్గిందని, మావోలు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ఇవాళ విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లిన హోంమంత్రి అక్కడ సీఎం నవీన్ పట్నాయక్ తో మావోయిస్టుల సమస్యపై చర్చించారు. తిరిగి విశాఖ వచ్చాక మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తోందని, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు.