: రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేస్తే.. దండ వేసి దండం పెడతారు!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను వినియోగించుకోకుండా..రోడ్డు పక్కనే పని కానిచ్చేసే వారున్నారు. వారు చేస్తున్న పని తప్పని వారికి తెలియజెప్పేందుకుగాను ట్రాఫిక్ పోలీసులు వినూత్న శైలిని అవలంబిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ పద్ధతిని పాటిస్తున్నారు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి ఒక పూలదండ మెడలో వేసి.. ఒక గులాబీ పువ్వు చేతికిస్తున్నారు. మరోసారి, ఇటువంటి పని చేయవద్దని.. స్వచ్ఛ హైదరాబాద్ కు పాటుపడాలని తెలియజెబుతున్నారు. బహిరంగ మూత్ర విసర్జన చేసే వాళ్లకు ఈ వినూత్న సత్కార కార్యక్రమాన్ని ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.