: నేను చూసిన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి: కేజ్రీవాల్
1986, సెప్టెంబర్ 5న ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానం హైజాక్ అయిన ఉదంతం ఆధారంగా తెరకెక్కిన 'నీరజ' చిత్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలోని ఓ సినిమా హాల్ లో డిప్యూటీ సీఎం, ఇతర పార్టీ ముఖ్యులతో కలసి చిత్రాన్ని వీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవ పరిస్థితులకు ఈ చిత్రం చాలా దగ్గరగా ఉందని, పలు సీన్లు తన మనసును కదిలించి వేశాయని అన్నారు. కాగా, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నీర్జా బానోత్ రియల్ స్టోరీ ఆధారంగా, రామ్ మధ్వానీ దర్శకత్వం వహించిన చిత్రంపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.