: కోహ్లీ అభిమానికి బెయిల్ నిరాకరించిన పాకిస్థాన్ కోర్టు


ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ మంచి ఫాం లోకి వచ్చి, అద్భుతమైన పరుగులు సాధించాడన్న ఆనందంలో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉమర్ ద్రాజ్ అనే కుర్రాడు భారత జాతీయ జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా, దానిని విచారించిన న్యాయస్థానం తిరస్కరించింది. పోలీసులు న్యాయస్థానానికి అందజేసిన నివేదికలో ఉమర్ ద్రాజ్ దేశద్రోహానికి పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ అతనికి బెయిల్ ఇవ్వకపోవడం విశేషం. ఈ కేసులో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News