: మహిళా అధ్యక్షురాలిని ప్రజలు ఒప్పుకుంటారో? లేదో?: హిల్లరీ నిర్వేదం


అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ పడేందుకు గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ, ఇంకా అనుకున్నంత ముందుకు వెళ్లలేకపోయిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ ఒకింత నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. "ఓ మహిళను అమెరికన్లు అధ్యక్ష పదవికి ఒప్పుకుంటారో? లేదో? నాకు తెలియడం లేదు. అయితే, ప్రజల దృక్పథంలో మాత్రం స్పష్టమైన తేడా వచ్చింది" అని 68 ఏళ్ల హిల్లరీ వ్యాఖ్యానించారు. క్లింటన్ భార్యగా గతంలో తొలి మహిళ హోదాను అనుభవించిన ఆమె, ఇప్పుడు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అందుకు అమెరికన్లు సహకరిస్తారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రజలు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్టు తాను కచ్చితంగా చెప్పగలనని 'వోగ్' మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి ఓ ఒపీనియన్ పోల్ లో మహిళా ఓటర్లు హిల్లరీకి బదులుగా, ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ వైపు మొగ్గుచూపారు. దీంతో హిల్లరీ క్యాంపులో కొంత ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News