: మరో 332 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ పోలీసు శాఖలో మరో 332 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కమ్యూనికేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 332 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఈ పోస్టులకు ఈ నెల 25 నుంచి మార్చి 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాగా, గత ఏడాది చివర్లో 9,281 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో బెటాలియన్ కానిస్టేబుల్, సీపీఎల్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్, ఫైర్ మెన్ పోస్టులు ఉన్నాయి.