: నీటిలో కూలిన హెలికాప్టర్...అంతా క్షేమం
సాధారణంగా హెలికాప్టర్ వంటివి కుప్పకూలితే ప్రాణాలతో బయటపడడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. హవాయ్ సమీపంలో నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నియంత్రించేందుకు ప్రయత్నించేలోపు కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ నీటిలో కూలడంతో అది పెద్దగా ధ్వంసం కాకపోగా, పైలట్ సహా ఐదుగురు సురక్షితంగా, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.