: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...: ఇండియా టుడే లేటెస్ట్ సర్వే


ఇండియాలో ప్రధాని పదవిని చేపట్టడానికి ఇప్పుడున్న వారిలో అత్యుత్తములు ఎవరన్న ప్రశ్నకు ఎక్కువ మంది నరేంద్ర మోదీ అని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఆయనకు ప్రధాన పోటీదారుగా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ముందుకు దూకారు. ఇండియా టుడే, కార్వీ ఇన్ సైట్స్ ఈ సర్వేను నిర్వహించగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 286 స్థానాలు, 37 శాతం ఓట్లు లభిస్తాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది దేశంలో అసహన ఛాయలు పోయాయని వ్యాఖ్యానించారు. ఇక దేశంలో ప్రధాన సమస్యలు ఏమని అడిగితే, 34 శాతం మంది ధరల పెరుగుదల, 34 శాతం మంది అవినీతి, 7 శాతం మంది ఆర్థికవ్యవస్థ, ఉగ్రవాదాలని చెప్పారు. నరేంద్ర మోదీ మంచి రోజులను తీసుకొచ్చారా? అని ప్రశ్నిస్తే, 40 శాతం అవునని, 31 శాతం మంది కాదని, 22 శాతం మంది పరిస్థితి పెద్దగా మారలేదని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News