: న్యాయమూర్తికి రూ. లక్ష ఇచ్చి దేశం విడిచి పొమ్మంటున్న హిందూ అతివాద సంస్థ!
జస్టిస్ సీఎస్ కర్ణన్... మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తి. ఆయన చుట్టూ వివాదాలు ఎన్నో. ఇటీవల తన బదిలీపై తానే స్వయంగా స్టే విధించుకుని, సుప్రీంకోర్టునే ప్రశ్నించిన వ్యక్తి. ఈయనకు ఓ హిందూ అతివాద సంస్థ రూ. 1 లక్ష చెక్కును పంపి, దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. తమిళనాడులో రిజిస్టరయిన హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ తాము కర్ణన్ ను వేరే ఏదైనా దేశానికి వెళ్లాలని కోరినట్టు తెలిపింది. ఇందుకోసం లక్ష రూపాయల చెక్కును పంపామని హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ తెలిపారు. ఆయన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందునే ఇలా చేశామని చెప్పారు. కర్ణన్ తమ చెక్కును క్యాష్ చేసుకుంటే, తాను ఏ దేశానికి వెళుతున్నానన్న విషయం తమకు చెబితే చాలని, ఇంకేమీ అడగబోమని అన్నారు.