: కూల్ డ్రింకులు తాగుతున్నారా ... ఒక్కసారి ఆలోచించండి!


మధుమేహం (డయాబెటీస్) వున్నా వాళ్ళే కాదు ... లేని వాళ్ళు కూడా తీపి పానీయాలకు దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇన్నాళ్ళూ మధుమేహం లేనివాళ్ళు నిక్షేపంగా తీపి పానీయాలు తీసుకోవచ్చని చెప్పిన శాస్త్రవేత్తలే ఇప్పుడు వద్దని కూడా చెబుతున్నారు. కారణం ... అదేపనిగా కూల్ డ్రింకులు కానీ, పళ్ళ రసాలు కానీ తాగుతున్న వాళ్ళలో మధుమేహం ముప్పు పొంచి ఉంటోందట. ప్రతి 336 మిల్లీ లీటర్ల తీపి పానీయంతో మధుమేహం ముప్పు 22% పెరుగుతున్నట్టు తాజాగా నిర్ధారణ అయింది. బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. పండ్లరసాలు, చక్కెరతో చేసిన కూల్ డ్రింకులు, కృత్రిమ తీపితో చేసిన పానీయాల ప్రభావాలను పరిశోదించగా ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. కాబట్టి, మనకు షుగర్ లేదు కదా అని చెప్పి అదే పనిగా తీపి పానీయాలు తీసుకునేవారు ఒక్కసారి ఆలోచించాలి మరి!

  • Loading...

More Telugu News