: ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కలసి ముందుకు వెళ్లాలి: రాజ్ నాథ్ సింగ్
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు విశాఖలో పార్టీ నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కలసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఇందుకు ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ముఖ్యంగా రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్క రైతు పంట భీమా పథకాన్ని వినియోగించుకునేలా చూడాలని, రైతులు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రాజ్ నాథ్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు.