: ఇక తేలికపాటి గ్యాస్ సిలిండర్లు... తగ్గనున్న బరువు!


గృహ అవసరాలకు సరఫరా అయ్యే వంటగ్యాస్ సిలిండర్ల బరువు నాలుగు కిలోల మేరకు తగ్గనుంది. ఖాళీ గ్యాస్ సిలిండర్లు ప్రస్తుతం 15.3 కిలోల బరువుతో ఉండగా, దాన్ని 11.3 కిలోలకు తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలు అందుకున్న హెచ్పీసీఎల్ (హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌) సిలిండర్ల తయారీని ప్రారంభించింది. ప్రస్తుత సిలిండర్లు 2.9 మిల్లీమీటర్ల మందమున్న ఇనుముతో తయారవుతుండగా, కొత్త వాటిని 2.3 మిల్లీ మీటర్లకు పరిమితం చేయడం ద్వారా బరువును తగ్గించనున్నారు. ఇక వీటిలో ఉండే గ్యాస్ పరిమాణం మాత్రం 14.2 కిలోలుగానే ఉంటుంది. అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నందున తక్కువ బరువులో ఉన్నా ఇవి మరింత దృఢంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News