: చెన్నై గ్యాంగ్ స్టర్ కు ఈడీ షాక్!... రూ.11.68 కోట్ల ఆస్తుల అటాచ్


ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నేరగాళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తునకు సంబంధించి నిన్న కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ... కొద్దిసేపటి క్రితం మరో కీలక కేసులో కఠిన చర్యలకు ఉపక్రమించింది. పలు నేరాల్లో పాత్ర ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై గ్యాంగ్ స్టర్ కాదుకుట్టు రవికి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రవికి చెందిన రూ.11.68 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ఈడీ పేర్కొంది.

  • Loading...

More Telugu News