: దిగ్విజయ్ చేతుల మీదుగా విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం


విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభమైంది. అక్కడి ఆంధ్రరత్న భవన్ ను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇకపై ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు నగర కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న ఈ భవనాన్ని ఆధునికీకరించి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇక్కడికే వచ్చి పార్టీ ముఖ్య నేతలను కలుస్తారు.

  • Loading...

More Telugu News