: కన్నయ్యకు బెయిల్ వచ్చేసినట్లే!... అభ్యంతరం చెప్పని పోలీసులు, కాసేపట్లో సుప్రీం తీర్పు
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో చోటుచేసుకున్న రాద్ధాంతం నేపథ్యంలో వర్సిటీ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్ పై దేశ ద్రోహం కేసు పెట్టిన ఢిల్లీ పోలీసులు ఆధారాలు లేకపోవడంతో కాస్తంత వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో నిన్న కన్నయ్య కుమార్ తనకు బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మరికాసేపట్లో విచారణ చేపట్టనున్న సుప్రీం ధర్మాసనం, పోలీసుల అభిప్రాయాన్ని తీసుకోనుంది. ఆ తర్వాత కోర్టు కన్నయ్య బెయిల్ పై తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయి. పోలీసుల నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తమయ్యే పరిస్థితులు లేని నేపథ్యంలో కన్నయ్యకు బెయిల్ మంజూరు ఖాయమనే వాదన వినిపిస్తోంది.