: తెరచుకున్న సైట్... డబ్బులు చెల్లించకుండానే 'ఫ్రీడమ్ 251' బుకింగ్!


కోట్లాది మంది భారత ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడమ్ 251' బుకింగ్స్ ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. వెబ్ సైట్ కు ట్రాఫిక్ అధికంగా ఉన్నందున ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తేగాని బుకింగ్స్ జరగడం లేదు. ఫోన్ ధర రూ. 251, డెలివరీ చార్జీలు రూ. 40లను రింగింగ్ బెల్స్ కు చెల్లించాల్సి వుండగా, డబ్బు తీసుకోకుండానే బుకింగ్స్ జరిగిపోతున్నాయి. డబ్బు చెల్లించాల్సిన లింక్ ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పంపుతామన్న సమాచారం వస్తోంది. 'ఫ్రీడమ్ 251' వెబ్ సైట్ రూపాన్ని కూడా మార్చారు. ఇందులో ఉన్న ప్రీలోడెడ్ యాప్స్ గురించిన సమాచారాన్ని వివరించారు. ఉమన్ సేఫ్టీ, స్వచ్ఛ భారత్, ఫిషర్ మ్యాన్, ఫార్మర్, మెడికల్ వంటి ప్రభుత్వ యాప్స్ తో పాటు గూగుల్ ప్లే స్టోర్, వాట్స్ యాప్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ తదితరాలను లోడ్ చేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News