: ఏపీ, తెలంగాణలకు ఒక్కో యూనివర్శిటీ!
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలు రానున్నాయి. హైదరాబాద్ కు ఏరోనాటికల్ వర్శిటీ, విశాఖపట్నానికి పెట్రో వర్శిటీ రానున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తూ 'ది హార్వార్డ్ ఆఫ్ ది స్కై'గా గుర్తింపు తెచ్చుకున్న ఎంబ్రిరీడిల్ ఏరోనాటికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ లో శాఖను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. తెలంగాణ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో చేసుకున్న ఒప్పందం మేరకు ఎంబ్రిరీడిల్ హైదరాబాద్ కు రానుంది. ఇక విభజన చట్టంలో పొందుపరిచినట్టు వైజాగ్ లో పెట్రోలియం యూనివర్శిటీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓకే చెప్పేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయన్న సంగతి తెలిసిందే.