: హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్లను ముట్టడించిన వికలాంగులు... పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్తత


విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న వర్గాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమకూ 3 శాతం మేర స్పష్టమైన రిజర్వేషన్లు కావాలంటూ వికలాంగులు తెలంగాణ మంత్రుల నివాసాలను ముట్టడించారు. నేటి ఉదయం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్ల వద్దకు వచ్చిన వికలాంగులు మంత్రుల వాహనాలను అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించారు. అయితే తమ డిమాండ్ కు స్పష్టమైన హామీ లభించేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పిన వికలాంగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పొద్దున్నే మినిస్టర్స్ క్వార్టర్ల వద్ద వికలాంగుల ఆందోళన, పోలీసుల మోహరింపు కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News