: కృష్ణ చివరి కూతురిని దత్తత అడిగాను...మహేశ్ బాబుతో ‘బాబీ’ తీస్తానన్నాను: కృష్ణంరాజు


తెలుగు సినిమా చరిత్రలో చాలా గొప్ప వ్యక్తి హీరో కృష్ణ అని మరో హీరో కృష్ణంరాజు అన్నారు. శ్రీశ్రీ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీడీ రిలీజ్ అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ, కృష్ణకు, తనకు ఉన్న అవినాభావ సంబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పారు. ‘గతంలో ఒకసారి, కృష్ణ చివరి కూతురిని నేను దత్తత చేసుకుంటానని అడిగాను. అందుకు ఆయన సరే అన్నాడు. అంతేకాదు, మహేశ్ బాబును సినిమాల్లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, అతనితో 'బాబీ' సినిమా తీస్తాను అన్నాను. మాలో మాకు ఎక్కడా తేడా లేదు. మాది ఒకే కుటుంబం. మా ఇద్దరి మనసులు ఒకటే’ అని కృష్ణంరాజు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News