: నాన్నకు ప్రేమతో... హీరో కృష్ణకు సన్మానపత్రాన్ని అందజేసిన మహేశ్!
సూపర్ స్టార్ హీరో కృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మా’ తరపున కృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఆయన్ని శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ‘మా’ సన్మాన పత్రాన్ని ప్రిన్స్ మహేశ్ బాబు అందజేశారు. అంతకుముందు, రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘నాన్నకు ప్రేమతో.. మహేశ్ బాబు కృష్ణగారికి సన్మాన పత్రాన్ని అందజేస్తారు’ అని అనగానే అభిమానుల చప్పట్లతో ఆడిటోరియం మార్మోగింది.