: సెంట్రల్ యూనివర్సిటీల్లో 207 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఎగరేయాలి: కేంద్రం
సెంట్రల్ యూనివర్సిటీల్లో 207 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలు కేంద్రంగా ఆందోళనలు పురుడు పోసుకుని ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుండడంతో నేడు కేంద్ర మానవ వనరుల శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఐక్యత, సమగ్రత పెంచేలా జాతీయ జెండాను యూనివర్సిటీల్లో 207 అడుగుల ఎత్తులో ఎగురవేయాలని నిర్ణయించారు. దీనికి వీసీలంతా ఆమోదం తెలిపారు.