: లీటర్ పెట్రోల్ కు 90 కిలోమీటర్ల మైలేజీ రప్పిస్తున్న మెకానిక్!


లీటర్ పెట్రోలుకు 50 నుంచి 60 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే 'సీడీ 100' వాహనానికి ఓ మెకానిక్ తన ప్రజ్ఞతో మైలేజ్ పెంచే ఏర్పాటు చేశాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నందిగామకి చెందిన గునితి గిరిబాబు అనే మెకానిక్ ఈ ఘనత సాధించాడు. సీడీ 100కి అదనంగా మరోరెండు ప్రత్యేకమైన ఛైన్ వీల్స్ ఏర్పాటు చేయడం ద్వారా రెండు గేర్లకే లీటర్ పెట్రోలుకు 80 నుంచి 90 కిలోమీటర్ల మైలేజీని రాబట్టాడు. అయితే, ఇది ఇంజిన్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది తెలియనప్పటికీ, లీటర్ పెట్రోలుకు 90 కిలోమీటర్లు మైలేజీ ఇవ్వడంపై అంతా అతని ప్రతిభను ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ ఏర్పాటు తమకూ చేయమంటూ కస్టమర్లు వస్తున్నారని మెకానిక్ గిరిబాబు తెలిపాడు.

  • Loading...

More Telugu News