: జగన్ చెప్పిన సంఖ్యే మా వద్దా ఉంది: ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ
టీడీపీ సర్కార్ ని కూల్చివేస్తానంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీలో చేరతామంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారని, వారిని టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘మీ వద్దకు ఎంతమంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు వచ్చారు?’ అన్న ప్రశ్నకు కేఈ స్పందిస్తూ.. ఆ విషయం ఇప్పుడు చెప్పనని అన్నారు. జగన్ చెప్పిన సంఖ్యే తమ వద్ద కూడా ఉందని ఆయన చెప్పారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏపీలో టీడీపీ సర్కార్ ని కూల్చివేసే సమయం రాగానే వారి పేర్లు బయటపెడతానని జగన్ నిన్న వ్యాఖ్యానించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.