: ఆ విమానం నిండా టాప్ హీరోలు, హీరోయిన్లే!
టాప్ హీరోలు, హీరోయిన్లతో కలిసి చేసిన ప్రయాణం అదిరిపోయిందని.. మర్చిపోలేని విధంగా ఉందని పొడుగుకాళ్ల సుందరి, బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ‘ఫస్ట్ క్లాస్ ఫుల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్’అని, ‘ప్రైవేట్ జెట్ లోని బిజెనెస్ క్లాసు మాదే’ అని శిల్పాశెట్టి దంపతులు ట్వీట్ చేస్తూ, కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇటీవల జరిగిన ఒక పార్టీకి ప్రముఖ నటీనటులందరూ కలిసి ఒక ప్రైవేట్ జెట్ లో అక్కడికి వెళ్లారు. శిల్పా కూడా తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి వెళ్లింది. ప్రముఖ నటులు సునీల్ శెట్టి, చుంకీ పాండే, అనిల్ కపూర్, అతని సోదరుడు సంజయ్ కపూర్ దంపతులు, హీరోయిన్ టబు తదితరులు అందులో ఉన్నారు.