: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గాంట్యూమ్ మృతి


కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఆండీ గాంట్యూమ్(95) ఈరోజు మృతి చెందారు. ఆయన మృతిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూసీబీ) సానుభూతి తెలిపింది. ఈ సందర్భంగా గాంట్యూమ్ కు సంబంధించిన క్రికెట్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. 1948లో విండీస్ తరపున ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడి శతకం సాధించిన, అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఆటగాడు గాంట్యూమ్ అని డబ్ల్యూసీబీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ అన్నారు. గాంట్యూమ్ 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 34.00 సగటుతో, 2,785 పరుగులు చేశాడని.. ఇందులో 5 సెంచరీలుండటం విశేషమన్నారు. వెస్టిండీస్ జట్టుకు సెలెక్టర్ గా, మేనేజర్ గా వ్యవహరించిన గాంట్యూమ్ గత నెలలోనే తన 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News