: ఆసియా కప్, టీట్వంటీ వరల్డ్ కప్ శ్రీలంక జట్టుకి కెప్టెన్ గా మలింగ
ఫిబ్రవరి 28 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇదే జట్టును మార్చిలో ప్రారంభం కానున్న టీట్వంటీ వరల్డ్ కప్ కు కూడా కొనసాగించనున్నారు. తాజాగా భారత్ తో జరిగిన టీట్వంటీ సిరీస్ లో రాణించిన యువ ఆటగాళ్లలో డిక్వెల్లా, శనక, చమీరలపై విశ్వాసం ఉంచిన సెలక్టర్లు రజితకు మొండి చెయ్యి చూపించారు. అలాగే జట్టు పగ్గాలు చండిమాల్ నుంచి సీనియర్ లసిత్ మలింగకు అప్పగించారు. శ్రీలంక జట్టుకు లసిత్ మలింగ (కెప్టెన్), మాథ్యూస్, చండిమాల్, దిల్షాన్, డిక్వెల్లా, షెహాన్ జయసూర్య, సిరివర్ధనే, శనక, చమీర, కులశేఖర, దుష్యంత్, తిసార పెరీరా, సెనానాయకే, హెరాత్, జఫ్రీలను సెలెక్టర్లు ఎంపిక చేశారు.