: ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు...దేశాన్ని కాదు: కిరణ్ రిజిజు
ప్రజలకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది కానీ జాతిని కాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జేఎన్ యూ వివాదం రోజురోజుకీ ముదిరిపోతుండడంతో ఆయన ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. జేఎన్ యూ దేశాన్ని ముక్కలు చేసేందుకు దారుణమైన ప్రతిజ్ఞ చేసిందని అయన అన్నారు. దేశ పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురును కొందరు విద్యార్థులు హీరోగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఈ జాతి వ్యతిరేక ఆందోళనకు కొందరు రాజకీయ నాయకులు మద్దతు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారతీయుడిగా ప్రతి పౌరుడూ దేశ సమగ్రత, ఐక్యతకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.