: ఆప్ నేతకు బెదిరింపు...దీటుగా సమాధానం!


ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రాకు ఆగంతుకుడు ఫోన్ చేసి బెదిరించాడు. కపిల్ మిశ్రాకు నేటి ఉదయం 8:48 నిమిషాలకు +442 +3844 +9100 +501 నెంబర్ నుంచి ఓ పోన్ కాల్ వచ్చింది. దానిని అటెండ్ చేసిన మంత్రికి...జేఎన్ యూ విషయంలో నోరు మూసుకుని ఉండాలని, లేని పక్షంలో కాల్చిచంపుతామని హెచ్చరించాడు. మీరెవరు? అని ప్రశ్నించడంతో పూజారి అని తెలిపాడని ఆయన చెప్పారు. దీనికి దీటుగా మంత్రి సమాధానమిస్తూ, నీ దగ్గర బుల్లెట్లు ఎక్కువగా ఉంటే తీవ్రవాదులను కాల్చి చంపాలని సూచించారు. ఈ విషయం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి తెలియజేశానని ఆయన చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పుతానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News