: చైనా మాత్రమే కాదు... దక్షిణ కొరియా కూడా పాక్ కు దగ్గరవుతోంది!
ఓ వైపు ఉపఖండంలో అశాంతిని పెంచేలా పాకిస్థాన్, చైనాల మధ్య వివిధ రంగాల్లో స్నేహబంధం విస్తరిస్తున్న వేళ, దక్షిణ కొరియా సైతం అదే దారిలో నడుస్తోంది. ద్వైపాక్షిక సంబంధాల విస్తరణలో భాగమంటూ, దాదాపు 50 మిలియన్ డాలర్ల స్వీయ నిధులతో ఇస్లామాబాద్ లో ఐటీ పార్క్ ను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. కొరియా ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్టు బ్యాంక్ ఈ నిధులను సమకూర్చనుందని సౌత్ కొరియా ప్రతినిధి సాంగ్ జాంగ్ హువాన్ వెల్లడించారు. ఈ మేరకు పాక్ ఐటీ అండ్ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ బోర్డు తో చర్చలు ఫలవంతమైనట్టు 'డాన్' పత్రిక ఓ వార్తను ప్రచురించింది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల్లో ఈ ఐటీ పార్క్ ఉంటుందని, పాక్ ఐటీ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా ఇక్కడ కంపెనీలు పని చేస్తాయని తెలుస్తోంది.