: జీహెచ్ఎంసీ అభివృద్ధికి వందరోజుల ప్రణాళికను విడుదల చేసిన కేటీఆర్


గ్రేటర్ ఎన్నికల అనంతరం పురపాలక శాఖను కూడా చేపట్టిన మంత్రి కేటీఆర్, తాను చెప్పినట్టుగానే జీహెచ్ఎంసీ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను విడుదల చేశారు. ఈ మధ్యాహ్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రణాళిక వివరాలు వెల్లడించారు. వాటిలో కొన్ని ముఖ్య అంశాలు చూస్తే... జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఏకకాలంలో భవనాలకు అనుమతులు మంజూరు చేస్తామని, వంద రోజుల్లో ఆన్ లైన్ అనుమతుల ప్రక్రియలకు శ్రీకారం చుడతామని తెలిపారు. కేవలం 30 రోజుల్లో భవనాలకు అనుమతులపై వివరాలు వెల్లడిస్తామన్నారు. గ్రేటర్ పరిధిలో వార్డు కమిటీలు, ఏరియా కమిటీలను ప్రారంభించబోతున్నట్టు కేటీఆర్ చెప్పారు. రూ.కోటి ఖర్చుతో 10 శ్మశానవాటికల నిర్మాణం చేపడతామని తెలిపారు. హైదరాబాదులో చెత్త తరలించేందుకు 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేవలు అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు వంద రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేస్తామని, సలహాలు, ఫిర్యాదుల కోసం జీహెచ్ ఎంసీ పోర్టల్ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు. జూన్ 2 నాటికి వంద రోజుల ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News