: ఈ దుర్మార్గులెవరో చెప్పండి? అదే శిక్ష వేద్దాం... భారత నెటిజన్ల వెతుకులాట!
ఇండియాలో ఇంత అమానుషంగా ప్రవర్తించే వారున్నారా? వారెవరో చెప్పండి? వారినీ ఇలాగే శిక్షిద్దాం... సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన భారత నెటిజన్లు వేస్తున్న ప్రశ్న ఇది. అసలేం జరిగిందో, ఇంత కోపం ఎందుకో తెలుసుకుంటే మనసు చివుక్కుమంటుంది. ముంబై నుంచి ఫేస్ బుక్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియోను తొలుత పోస్ట్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు, జంతు పరిరక్షక సంఘాలు శోధిస్తున్నాయి. ఈ వీడియోలో ఓ శునకం ముందరి కాళ్లను రెండు తాళ్లతో అటూ ఇటూ ఉన్న పోల్స్ కు కట్టేసి వెనుక కాళ్లపై నిలబెట్టగా, తాగేసిన సిగరెట్లను కాళ్లముందు పడేస్తున్న సీన్లు, దానిపై రాళ్లు, బూట్లు, చెప్పులు విసురుతున్న సీన్లు ఉన్నాయి. ఆ శునకం పడుతున్న బాధను నిస్సిగ్గుగా వీడియో తీసి దాన్ని పోస్ట్ చేశారు. దీన్ని చూసిన వేలాది మంది ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇంత దుర్మార్గానికి పాల్పడ్డ వారి గురించి ఆరా తీస్తున్నారు. చూసేందుకు ఇబ్బందికరంగా ఉన్నందున ఈ వీడియో లింక్ ను ఇవ్వలేకపోతున్నాం.