: అఫ్జల్ గురు సెల్ లోనే కన్నయ్య కుమార్!... తీహార్ జైల్లో కన్నయ్యపై పటిష్ట నిఘా


భారత పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్.. చరమాంకంలో అఫ్జల్ గురు గడిపిన స్థలానికే చేరుకున్నారు. నిన్న పాటియాల కోర్టులో జరిగిన దాడి నేపథ్యంలో కన్నయ్యను మరింత భద్రత ఉన్న జైల్లోకి తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్న రాత్రి 8.15 గంటలకు కన్నయ్యను పోలీసులు తీహార్ జైలుకు తీసుకువచ్చారు. జైల్లోని మూడో నెంబరు గదిలో ఆయనను ఉంచారు. ఈ గదిలోనే ఉరి శిక్షకు ముందు అఫ్జల్ గురు గడిపాడు. ఇదిలా ఉంటే, కన్నయ్య ఆత్మహత్యాయత్నం చేయవచ్చన్న అనుమానాలతో ఆయన ఉంటున్న జైలు గదిపై 24 గంటల నిఘాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడో నెంబరు గది పరిసరాల్లో 50 మంది దాకా పోలీసులు గస్తీ కాస్తున్నారు. నిన్న కోర్టులో జరిగిన దాడి నేపథ్యంలో తీహార్ జైలు పరిసరాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత అమల్లోకి వచ్చింది.

  • Loading...

More Telugu News