: నిన్న రామలక్ష్మణులపై కేసు... నేడు ఆంజనేయుడికి నోటీసులు!


సీతమ్మను రాముడు అడవులకు పంపడాన్ని సవాలు చేస్తూ, ఓ కేసు కోర్టుకు వచ్చి దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించిన సంగతి మరువకముందే, ఆంజనేయస్వామికి ఓ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రోహ్తస్ జిల్లాలోని డెహ్రీ ఆన్ సోన్ లో రహదారి పక్కన ఉన్న పంచముఖ హనుమాన్ ఆలయం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంగా మారింది. దీన్ని తొలగించాలంటే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రజా పనుల విభాగం కోర్టుకు ఎక్కింది. ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు హనుమంతుడు కోర్టుకు రావాలని నోటీసులు జారీ చేయగా, వాటిని తీసుకువెళ్లిన అధికారులు ఎవరికి ఇవ్వాలో తెలియక గుడి గోడలకు అంటించి వచ్చారు. అంతకుమించి వారుమాత్రం ఏం చేయగలరు?

  • Loading...

More Telugu News