: మూడు ముక్కలాట!... ఏపీఎస్ఆర్టీసీలో నేడే కార్మిక సంఘం ఎన్నికలు
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం తొలి ఎన్నికలు మరికాసేపట్లో మొదలుకానున్నాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) లతో పాటు ఈ దఫా కొత్తగా ఏర్పాటైన కార్మిక పరిషత్ కూడా ఎన్నికల పోటీలోకి దిగింది. ఈ క్రమంలో ఆర్టీసీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా... ఎన్ఎంయూ, ఈయూల మధ్యే పోటీ నెలకొన్నా, ఈ దఫా ముక్కోణ పోటీ అనివార్యమైంది. ఏపీలో అధికార టీడీపీ అనుబంధ కార్మిక సంఘంగా కార్మిక పరిషత్ రంగప్రవేశం చేసింది. ఇదిలా ఉంటే, ఆర్టీసీ అనుబంధ సంఘాన్ని కలిగిన విపక్ష వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. తగినంత బలం లేకనే పోటీ చేయట్లేదని వైసీపీ యూనియన్ పేర్కొంది. ముక్కోణ పోటీలో ఏ సంఘం గెలుస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.