: 50,000 ఇచ్చి వేరే ఉపాథి చూసుకోమన్న మంత్రి పద్మారావు
తెలంగాణ మంత్రి పద్మారావు నల్గొండ జిల్లాలో ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా గుడుంబా అమ్ముతున్న ఓ మహిళను కలిశారు. ఇలా గుడుంబా అమ్మడం నేరం కదా? ఇకపై గుడుంబా వ్యాపారం మానేయాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె తన బాధలన్నీ ఆయనతో మొరపెట్టుకుంది. మరేదైనా వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి సారూ? అని ప్రశ్నించింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి తన దగ్గరున్న 50,000 రూపాయలు తీసి ఆమెకు ఇచ్చి, గుడుంబా వ్యాపారం మానేసి, మరేదైనా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. దీంతో ఆమెకు నోట మాటరాలేదు. మంత్రి పద్మారావు స్పందించిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. దీంతో నల్గొండలో టాక్ ఆఫ్ ది టౌన్ గా పద్మారావు నిలిచారు.