: మన రాష్ట్రాలను పొరుగు దేశాల్లో ఉంచిన ట్విట్టర్ !
మన దేశంలోని రాష్ట్రాలను పొరుగు దేశాల్లో ఉన్నట్లుగా చూపిస్తున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పై భారతీయులు మండిపడుతున్నారు. లొకేషన్ సర్వీస్ ను ఉపయోగించే సమయంలో ఈ తప్పుడు సమాచారం వస్తోంది. జమ్మూను పాకిస్తాన్ లోను, జమ్మూకాశ్మీర్ ను చైనా దేశంలోను ఉన్నట్లు చూపెడుతోందని మన దేశానికి చెందిన ట్విట్టర్ ఖాతాదారులు ఆగ్రహిస్తున్నారు. కాగా, లొకేషన్ సర్వీస్ ను యూజర్స్ తమ ట్వీట్ లతో పాటూ తమ లొకేషన్ ను కూడా టాగ్ చేసుకునే అవకాశాన్ని ట్విట్టర్ కల్పించింది. జీపీఎస్ ద్వారా లేదా మాన్యువల్ గా టైప్ చేసి ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు. గతంలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా ఇటువంటి తప్పిదమే చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా దేశంలో ఉన్నట్లు చూపించింది. దీంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.