: బాయ్ ఫ్రెండ్ తో కలిసి కన్నకూతురికి నరకం చూపించిన తల్లి!


ఒక తల్లి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కన్నకూతురుకు బతికుండగానే నరకం చూపించింది. ఈ విషాద సంఘటన జపాన్ లోని పుక్వోకా ప్రాంతంలో జరిగింది. యుకో ఒగాటా అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ టకేషీ ఎగామితో కలసి, గత కొంతకాలంగా సొంత కూతుర్ని చిత్రహింసలకు గురిచేస్తోంది. తాజాగా, ఇంట్లో పెంచుకునే 30 గోల్డెన్ ఫిష్ లను తినాలని ఆదేశించింది. గతంలో ఆ బాలికను మంచానికి కట్టివేసి, ముఖంపై కొట్టడమే కాకుండా ఆమె నాలుకపై సిగరెట్టుతో కాల్చారు. ఈ దారుణాలన్నీ బయటపడటంతో పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్టు చేశారు. కాగా, ఇటువంటి దారుణ సంఘటనలు జపాన్ లో తరచుగా జరుగుతుంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News