: నాటకం రిహార్సల్స్ లో కత్తి దిగి, జపాన్ నటుడు మృతి!
ఓ నాటకం కోసం చేస్తున్న రిహార్సల్స్ లో విషాదం చోటు చేసుకుంది. త్వరలో ప్రదర్శించబోయే ఓ నాటకం కోసం జపాన్ లోని టోక్యోలోని స్టూడియోలో జపాన్ నటుడు డిగో కాసినో(33), మరికొంతమంది కలసి రిహార్సల్స్ చేస్తున్నారు. యుద్ధ సన్నివేశాల కోసం ఒకరికొకరు పోటీపడి మరీ నటిస్తున్నారు. ఈ సమయంలో డిగో పొట్టలోకి అనుకోకుండా ఓ కత్తి దూసుకుపోయింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. అయితే అసలీ ఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.