: ఎయిర్ కోస్టా విమానం అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ కోస్టాకు చెందిన హైదరాబాద్-తిరుపతి విమానంలో సమస్యలు తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరింది. కొద్ది సేపటికే విమానం బ్రేకులు ఫెయిలైనట్లు పైలెట్ గుర్తించాడు. దీంతో వెంటనే వెనక్కి మళ్లించి విమానాన్ని సురక్షితంగా దింపివేశాడు. ప్రయాణికులందరు సురక్షితంగానే ఉన్నారని ఎయిర్ కోస్టా సిబ్బంది తెలిపారు. కాగా, ఈ విమానంలో పలువురు వీఐపీలు ఉన్నట్లు సమాచారం.