: సమ్మక్క- సారలమ్మకు మొక్కు చెల్లించుకున్న కోదండరాం


వరంగల్ జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క - సారలమ్మ జాతరలో జేఏసీ ఛైర్మన్ కోదండరాం మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తన ఎత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తానని ఆయన మొక్కుకున్నారు. దాంతో ఇవాళ తన ఎత్తు 78 కిలోల బంగారాన్ని అమ్మవారికి ఆయన చెల్లించారు. ఆయనతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు పాపారావు, దర్శకుడు నర్సింగరావు, వైరా ఎమ్మెల్యే తదితరులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ, జాతరలో భక్తులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పించిందని చెప్పారు.

  • Loading...

More Telugu News