: ఆగస్టు 12 నుంచి తెలంగాణలో కృష్ణా పుష్కరాలు... రూ.825 కోట్లు ఖర్చవుతుందని అంచనా
తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ఇవాళ సీఎం కేసీఆర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు రూ.825.16 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే ఈ పనులకు 2016-17 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఆర్ అండ్ బీ, నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా రహదారులు, స్నానఘట్టాలు, మంచినీటి నల్లాలు తదితర నిర్మాణాల కోసం రూ.744.85 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అదనంగా మరో రూ.80.31 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేయాలని ఆదేశించారు. పుష్కరాల్లో భక్తులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.