: రోజా సస్పెన్షన్ పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈమేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయమై అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రోజా పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. కాగా, గత ఏడాది ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశించారు. దీనిని సవాల్ చేస్తూ రోజా హైకోర్టును ఆశ్రయించారు. సస్పెన్షన్ పై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News