: రోడ్డుపై గాయపడిన వ్యక్తి... కాన్వాయ్ ఆపి మరీ ఆసుపత్రికి తీసుకెళ్లిన దీదీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దయార్ధ గుణాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడి రహదారిపై పడి ఉన్న ఓ వ్యక్తిని స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కోల్ కోతాలో ప్రసేన్ జిత్ కుందు అనే 28 ఏళ్ల వ్యక్తి తన బైక్ పై వెళుతుండగా వెనకగా వస్తున్న ఓ ట్యాక్సీ ఢీ కొట్టింది. దాంతో అతను తీవ్ర గాయాలపాలై రోడ్డు మీద పడిపోయాడు. అప్పుడే అటుగా తన వాహనంలో వెళుతున్న మమతా అతడిని చూశారు. వెంటనే స్పందించిన ఆమె తన కాన్వాయ్ ను ఆపి గాయపడిన వ్యక్తిని ఎస్ఎస్ కేఎం ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం వైద్యులు అతనికి చికిత్స చేశారు. మరోవైపు ఆ వ్యక్తిని ఢీ కొట్టిన ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న(మంగళవారం) మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.