: కేసీఆర్ కు అపురూపమైన కానుకనిచ్చిన అనంతపురం అభిమాని


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో కూడా అభిమానులు ఉన్నారన్న సంగతి ఆయన అమరావతి శంకుస్థాపనకు హాజరైన సందర్భంలోనే వెల్లడైంది. తాజాగా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ కంచుకోట అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అపురూపమైన కానుకను బహూకరించారు. ధర్మవరం పట్టు శాలువాలపై కేసీఆర్ దంపతుల చిత్రాలను చాకచక్యంగా నేసిన ఆ వ్యక్తి దానిని కేసీఆర్ కు స్వయంగా అందజేశారు. నేతలో ఒదిగిపోయిన చిత్రాలను చూసిన కేసీఆర్ ఆనందం వ్యక్తం చేసి, అతని ప్రతిభను అభినందించారు. రాష్ట్రాలు విడిపోయినా కేసీఆర్ పై నున్న అభిమానంతో పట్టుశాలువా నేసి తీసుకొచ్చానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News