: చిరంజీవి చిన్నల్లుడు ఇతనే!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కుదిరిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ఆమె వివాహం గురించిన కబుర్లు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న చిరంజీవి పెళ్లి పనులను ప్రారంభిస్తూ, స్వయంగా పసుపు దంచగా, తాజాగా ఆయన అల్లుడి గురించిన సమాచారం బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ కుమారుడు కల్యాణ్ తో శ్రీజ పెళ్లి నిశ్చయమైందని తెలుస్తోంది. కల్యాణ్ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటం, అతను అందంగా కనిపిస్తుండటంతో, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తాడని అభిమానులు ఆనందపడుతున్నారు.