: సుప్రీంకోర్టులో 'వందేమాతరం' అని అరిచిన న్యాయవాది... ఏమనాలో పాలుపోని స్థితిలో న్యాయమూర్తి!
జేఎన్యూలో జరిగిన ఘటనలపై విచారణ జరుపుతున్న వేళ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది 'వందేమాతరం' అని నినదించడం కలకలం రేపింది. న్యాయవాది రాజీవ్ తడాక్, కోర్టుహాలులో విచారణ జరుగుతున్న వేళ ఈ నినాదాలు చేశారు. ఆపై క్షమాపణలు కూడా కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి "సుప్రీంకోర్టు హాలులోనే ఇలా జరిగింది. ఇక మేం చెప్పడానికి ఏముంది?" అని వ్యాఖ్యానించారు. కాగా, వందేమాతరం అని నినదిస్తే శిక్ష విధించవచ్చని లేదా ఆరోపణలు మోపవచ్చని ఏ విధమైన చట్టం మన రాజ్యాంగంలో లేదు. ఇక కోర్టు హాలులో నిశ్శబ్దాన్ని పాటించనందుకు గాను ఆరోపణలు మోపే అవకాశాలున్నా, న్యాయవాది బేషరతు క్షమాపణ చెప్పడంతో న్యాయమూర్తులు సైతం సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది.