: ఓపీ శర్మ చర్యను బీజేపీ సమర్థించదు: రవిశంకర ప్రసాద్


ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే ఓంప్రకాశ్ శర్మ వ్యవహరించిన విధానం సమర్థనీయం కాదని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఓపీ శర్మ చర్యను బీజేపీ సమర్థించదని అన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా అది తప్పేనని ఆయన పేర్కొన్నారు. హింసాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా తప్పేనని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలను తమ ప్రభుత్వం సమర్థించదని ఆయన తెలిపారు. కాగా, జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ను పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా ఆయనపై ఓపీ శర్మ దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగని ఆయన తన దగ్గర తుపాకీ ఉండి ఉంటే కాల్చిపారేసే వాడినని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News